నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.వి రమణ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో డీఆర్వో దంపతులను కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే రమణ ఎన్నో రెవెన్యూ సమస్యలను పరిష్కరించారని జిల్లా పాలనాధికారి అన్నారు. రెవెన్యూ రంగంలో ఎంతో అనుభవమున్న వ్యక్తి అని కొనియాడారు. రాజకీయాల్లో కూడా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: కనుపూరు కెనాల్‌కు భారీ గండి... తాత్కాలికంగా ఇసుక బస్తాల ఏర్పాటు