ETV Bharat / state

ఎనిమిదేళ్ల క్రితం హత్య.. నేడు కోర్టు సంచలన తీర్పు

JUDGEMENT ON MURDER CASE IN NELLORE: ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో.. నేడు సంచలన తీర్పు వెల్లడైంది. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి జీవిత ఖైదుతో రూ.5వేల జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు తీర్పు ఇచ్చింది.

JUDGEMENT ON MURDER CASE IN NELLORE
JUDGEMENT ON MURDER CASE IN NELLORE
author img

By

Published : Mar 24, 2023, 6:02 PM IST

JUDGEMENT ON MURDER CASE IN NELLORE : నెల్లూరు హాస్పిటల్​ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ హత్య కేసులో నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్​ సత్యవాణి తీర్పు చెప్పారు. 2015 మే28 జరిగిన ఈ హత్యలో భార్య, కుమారుడితో పాటు మరో ముగ్గురిని హంతకులుగా పోలీసులు తేల్చారు. భార్యాభర్తల మధ్య వివాదంతో పాటు ఆస్తి తగాదాలే హత్యకు కారణమని నిర్ధారించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల నాయకుడు డాక్టర్ జి విజయ్ కుమార్ హత్య కేసులో ఒకటవ అదనపు సివిల్ జడ్జి కోర్టు ఈ రోజు సంచలన తీర్పు జిల్లా ప్రజలకు ఆ హత్య మళ్లీ గుర్తుకు వచ్చేలా చేసింది. విజయ్ కుమార్​తో విడాకులు పొందిన ఆయన భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య,.. ఉషారాణితో సహజీవనం చేస్తున్న న్యాయవాది శ్రీధర్, మరో ఇద్దరు కిరాయి హంతకులకు యావజ్జీవ కారాగార శిక్ష, 5000 రూపాయలు జరిమానా విధిస్తూ..జడ్జి సత్యవాణి తీర్పు చెప్పారు.

అసలేం జరిగింది: జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల నాయకుడు డాక్టర్​ విజయ్ కుమార్ హత్య రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. 2015 మే 28న కుమార్​ను తన నివాసంలోనే అతని కుమారుడు సుందరయ్య, విడాకులు పొందిన భార్య ఉషారాణి.. ఆమెతో సహజీవనం చేస్తున్న న్యాయవాది శ్రీధర్​లు కలిసి హత్య చేశారు. ఆపై గుండెపోటుతో మరణించినట్లు నాటకం ఆడారు. అయితే అతని మృతిని నమ్మని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ విజయకుమార్ స్నేహితుడు.. న్యాయవాది కేవీ శేషారెడ్డి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే విజయ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని ఖననం చేసేందుకు భార్య, కుమారుడు, హత్య నేరంతో సంబంధం కలిగిన మరో ఇద్దరు ప్రయత్నం చేశారు. దీనిని ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన 5వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.

మే 29న డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో విజయ్​కుమార్ రెడ్డిని గొంతు నులిమి చంపినట్లుగా ప్రాథమిక నివేదిక అందింది. ఆ రిపోర్ట్ ఆధారంగా డాక్టర్ విజయ్ కుమార్ భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య, న్యాయవాది శ్రీధర్, కిరాయి హంతకులుగా భావిస్తున్న గంగరాజు, పోలురాజులపై 302 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను జూన్ 3న అరెస్టు చేశారు. అనంతరం ఐదవ పట్టణ సీఐ సుబ్బారావు కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేశారు.

దాదాపు 8 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో 26 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా మూర్తి, కేబీఎన్ మణి, విజయమ్మ, కుడుముల రవిలు కేసును వాదించారు. పూర్తి వివరాలు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. డాక్టర్ విజయ్ కుమార్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.