ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో అదృశ్యం... హైదరాబాద్​లో ప్రత్యక్షం

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామంలో ఐదుగురు అదృశ్యం ఘటన సుఖాంతమైంది. వారంతా హైదరాబాద్​లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు వెంకటగిరి తీసుకువచ్చారు. కుటుంబ కలహాలతోనే వారు ఇళ్లు వదిలివెళ్లినట్లు గుర్తించారు.

women's missing
women's missing
author img

By

Published : Nov 20, 2020, 9:05 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురిని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు గుర్తించి... వెంకటగిరికి తీసుకొచ్చామని గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కుటుంబకలహాల వల్ల భర్తలతో ఉండలేక వీరు హైదరాబాద్ వెళ్లారని డీఎస్పీ తెలిపారు. బతుకు దెరువు కోసమే పిల్లలను తీసుకుని భాగ్యనగరం వెళ్లారని చెప్పారు.

ఇదీ జరిగింది

జీకేపల్లికి చెందిన కృష్ణయ్య, సుధాకర్‌ అన్నదమ్ములు. వీరిద్దరూ బంధువులైన వారినే వివాహం చేసుకున్నారు. కృష్ణయ్యకు భార్య విజయ(26), కుమార్తెలు శ్రీవేణి(3), దివ్యశ్రీ(7 నెలలు) ఉన్నారు. సుధాకర్‌కు భార్య సుప్రియ(25), కుమార్తె సురేఖ(2) ఉన్నారు. దివ్యశ్రీకి అనారోగ్యంగా ఉండటంతో ఈ ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లలతో కలిసి గత సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. వైద్యుల వద్దకు నేరుగా వెళ్లగా వారు ఓపీ చీటీ తీసుకురావాలని సూచించారు. ఆ ప్రక్రియ ఆలస్యం కావడం, పీహెచ్‌సీలో నెబ్యులైజర్‌ సౌకర్యం లేదని తెలియటంతో తాము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తామని చెప్పి ఆటోలో బయలుదేరారు. అలా బయటకు వెళ్లిన వీరు.. రాత్రి వరకూ ఇళ్లకు చేరకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు... ఎట్టకేలకు అదృశ్యమైన వారిని గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.