జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ టీంల మధ్య పోటీ ఉల్లాసంగా సాగింది. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే.. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఓటర్లకు కావాల్సిన సమాచారం, ఎన్నికల నియమ, నిబంధనల కోసం ఎన్నికల సంఘం యాప్స్‌ను రూపొందించిందని అన్నారు. దివ్యాంగులకు అందించే సేవలు ఇతర విషయాలపై యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అలాగే కొత్తగా ఈ ఎపిక్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రజల వద్ద ఉన్న పాత ఓటర్ కార్డులను భవిష్యత్తులో ఈ ఎపిక్ కార్డులుగా మారుస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: