ETV Bharat / state

ఉదయగిరి దుర్గాన్ని సందర్శించిన కలెక్టర్ - ఉదయగిరి నేటి వార్తలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గాన్ని జిల్లా పాలనాధికారి సందర్శించారు. దుర్గం అభివృద్ధికి తగిన చర్యలు చేపడతామని అన్నారు. ఈ ప్రాంత చరిత్ర తెలిసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

nellore district collector visites udayagiri fort
ఉదయగిరి దుర్గంను సందర్శించిన కలెక్టర్
author img

By

Published : Oct 16, 2020, 4:48 PM IST

చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఉదయగిరి దుర్గాన్ని... పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ కే.వి.ఎన్​ చక్రధర్​బాబు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​రెడ్డితో కలసి ఉదయగిరి దుర్గం కొండను ఆయన సందర్శించారు.

ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయగిరి ముఖద్వారం వద్ద ఉండే ఆనకట్టను... ఉపాధి హామీ పథకం, ఇరిగేషన్ శాఖల అనుసంధానంతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ప్రాంత చరిత్రను తెలియజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. అటవీ, ఆర్కియాలజీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ... అభివృద్ధి చేపడతామని ప్రకటించారు. ఇందుకు స్థానికులు సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం: గుంటూరు కలెక్టర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.