నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంటల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగులమందులు, యంత్ర పరికరాలు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రైతు... రైతుభరోసా కేంద్రాల్లోనే ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
'బహిరంగ మార్కెట్లకు రైతులు స్వస్తి పలకాలి' - nellore district collector latest press meet news
రైతులు ఎరువులు, యంత్రపరికరాలు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన బహిరంగ మార్కెట్లకు రైతులు స్వస్తి పలికేలా రైతు భరోసా కేంద్రాల్లో చర్యలు చేపట్టాలని సూచించారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంటల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, పురుగులమందులు, యంత్ర పరికరాలు అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రైతు... రైతుభరోసా కేంద్రాల్లోనే ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: పులివెందుల మోడల్ టౌన్‌పై సీఎం సమీక్ష