నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెంచలస్వామి అనే రైతు.. తనకున్న మూడున్నర ఎకరాలతో పాటు మరో నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఆరు ఎకరాల్లో నిమ్మ.. రెండు ఎకరాల్లో వరి పంటను వేశారు. నిమ్మ పంట సక్రమంగా రాకపోవటం, లాక్డౌన్ కారణంగా చేతికొచ్చిన కొద్ది పంట అమ్ముకునే అవకాశం లేకపోవడం వల్ల పెంచలస్వామి తీవ్రంగా నష్టపోయారు.
పొలంలో బోరు వేసేందుకు, వ్యవసాయానికి దాదాపు రూ.10 లక్షలు వరకు అప్పుచేశారు. సాగు చేసిన పంటల్లో నష్టాలు రావడం, అప్పుల వాళ్ల ఒత్తిడితో గత నెల 21వ తేదీన పురుగుల మందు తాగి పెంచలస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని రైతు భార్య సులోచనమ్మ విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: