ETV Bharat / state

Lokesh Yuvagalam: సింహపురి నుంచే మార్పు మొదలైంది.. జగన్ పనైపోయింది​: లోకేశ్​ - nara lokesh serious on ys jagan

Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. జిల్లాలోని అనంతసాగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. యువగళం.. మనగళం.. ప్రజాబలం అంటూ లోకేశ్​ ప్రసంగం ప్రారంభించి.. జగన్​పై విమర్శలు గుప్పించారు.

Nara Lokesh Yuvagalam Padayatra
నన్నేమి చెయలేక కోడికత్తి బ్యాచ్​ని పంపి నాపై కోడిగుడ్డు వేయించాడు జగన్​: లోకేశ్​
author img

By

Published : Jun 16, 2023, 10:21 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra: నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు యువగళం పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. అనంతసాగరంలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. నారా లోకేశ్ ప్రసంగం ప్రారంభం కాగానే ఈలలు చప్పట్లతో మారుమోగింది. యువగళం.. మనగళం.. ప్రజాబలం అంటూ లోకేశ్​ ప్రనంగం ప్రారంభించారు.

వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారు.. రాయలసీమ జిల్లాల్లో నేను అడుగుపెట్టిన తరువాత వైసీపీ నేతలు గజగజా వణికారనీ అలానే నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టక ముందే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారు అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. సింహపురి నుంచే మార్పు మొదలైంది.. జగన్ పనైపోయిందని వ్యాఖ్యానించారు. యువగళాన్ని అడ్డుకోవడానికి జగన్ అడ్డదారులు తొక్కాడు. జిఓ నెం 1 తెచ్చాడు.. మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పా.. తగ్గేదే లేదని లోకేశ్​ అన్నారు.

కోడికత్తి బ్యాచ్​కి భయపడతామా.. యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్​కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నాలుగు టీవీలు పగలగొట్టాడు. ఇక ఏమీ చెయ్యలేక కోడికత్తి బ్యాచ్​ని పంపి కోడిగుడ్డు వేయించాడు అని ఎద్దేవా చేశారు. క్లైమోర్​మైన్లకే భయపడని కుటుంబం మాది.. కోడికత్తి బ్యాచ్​కి భయపడతామా.. అని ధ్వజమెత్తారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని లోకేశ్​ విమర్శించారు. చంద్రబాబు కట్టిన సచివాలయంలో కూర్చోవడం.. చేతగాని వాళ్లు మూడు రాజధానులు కడతాం అని బిల్డప్ ఇచ్చారు. జగన్ రెడ్డి విశాఖను క్రైం క్యాపిటల్ చేసాడని అమిత్​షా అన్నారు.. దీంతో మంత్రులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకి వచ్చి మొరిగారని విమర్శించారు.

నన్నేమి చెయలేక కోడికత్తి బ్యాచ్​ని పంపి నాపై కోడిగుడ్డు వేయించాడు జగన్​: లోకేశ్​

జగన్​కి ఒక వ్యాధి ఉంది.. జగన్​ది కన్నింగ్ బుద్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే.. తల్లి, చెల్లితో పాటు నమ్మి ఓటేసిన అందరిని మోసం చేసాడు. అందుకే కన్నింగ్ జగన్ రెడ్డికి అని పేరు పెట్టా అని అన్నారు. కన్నింగ్ జగన్​కి ఒక వ్యాధి ఉంది.. అది మైథోమానియా సిండ్రోమ్​ ఈ వ్యాధితో జగన్ బాధపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పథకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.. దీనిపై రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని అన్నారు.

విద్యుత్ వైర్ల కన్నా కరెంటు బిల్లులే ఎక్కువ.. రాష్ట్రంలో విద్యుత్ వైర్ల కన్నా కరెంటు బిల్లులే ఎక్కువ షాక్ కొడుతున్నాయని.. లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఒక్క మే నెలలోనే పెంచిన విద్యుత్ ఛార్జీలతో 11వేల 3వందల కోట్ల రూపాయలు అదనంగా లాగేశారని మండిపడ్డారు. విశాఖ నేరాలకు అడ్డాగా మారిందన్న కేంద్రమంత్రి అమిత్‌షా మాట నిజమైందని.. భూ దందా వాటాల్లో తేడా వచ్చి వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్​నకు గురైందని లోకేశ్‌ తెలిపారు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.