నెల్లూరు జిల్లాలో మొదటి విడత నాడు-నేడు పథకంలో రూ 192 కోట్లతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఆధునిక హంగులు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామంలోని కస్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలకు కోటి పది లక్షల అంచనాలతో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్న విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థినుల వృత్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలో 150 ఒక పాఠశాలలకు 24 కోట్ల 57 లక్షల తో నాడు నేడు మాబడి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కళాశాల భవనాలకు ఎమ్మెల్యే ఆనం శంకుస్థాపన - nadu nedu first meeting in nellore
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామం లో కస్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో అదనపు గదులను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు.మెుదటి విడత నాడు-నేడు పథకంపై సమీక్ష నిర్వహించారు.
![కళాశాల భవనాలకు ఎమ్మెల్యే ఆనం శంకుస్థాపన nadu nedu first meeting in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5966475-972-5966475-1580900011712.jpg?imwidth=3840)
నెల్లూరు జిల్లాలో మొదటి విడత నాడు-నేడు పథకంలో రూ 192 కోట్లతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఆధునిక హంగులు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామంలోని కస్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలకు కోటి పది లక్షల అంచనాలతో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్న విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థినుల వృత్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలో 150 ఒక పాఠశాలలకు 24 కోట్ల 57 లక్షల తో నాడు నేడు మాబడి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్ప్రెస్ ఇంజన్