MVI Suspended: ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ గోపీనాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 200కు పైగా వాహనాలను నెల్లూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారంపై విచారణ జరిపిన రవాణాశాఖ మంత్రి పేర్నినాని సూళ్లూరుపేట ఎంవీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
దీంతో పాటు గూడూరు ఆర్టీవో మల్లికార్జున రెడ్డిని తక్షణమే ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆనంద్‌ను విచారణ అధికారిగా నియమించారు.
ఇదీ చదవండి: acb raids: రిజిస్ట్రార్ కార్యాలయంలో అనినీతి అధికారుల సోదాలు