వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీరును భాజపా నేతలు తప్పుబట్టారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి వచ్చినవారికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి లాంటి వారి సలహాలతోనే వైకాపాకు చెడ్డపేరు వస్తోందని ఆయన విమర్శించారు. కరోనా కిట్ల విషయంలో మంత్రి ఒక రకంగా, అధికారులు మరో రకంగా చెప్పడాన్ని భాజపా తప్పుపడితే... సమాధానం చెప్పలేకే వైకాపా లేనిపోని విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్.. విజయసాయి రెడ్డి లాంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: