మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాళులర్పించారు. నెల్లూరులోని భాజపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. వాజ్పేయీ ఆశయాలను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని వాకాటి కొనియాడారు.
రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని చెప్పారు. ఈ చట్టాలపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను పక్కదారి పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాల ద్వారా జరిగే మేలును రైతాంగం తెలుసుకోవాలన్నారు.
వ్యవసాయ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చి..రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకించటమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాలపై కొన్ని పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల మద్దతు మాత్రం భాజపాకే ఉందని..అది ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా రుజువైందన్నారు.
ఇదీ చదవండి: