నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైకాపా నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు 70 శాతం కార్యరూపం దాల్చుతున్నాయని, అవి ప్రజలకు అందాల్సి ఉందన్నారు. పక్కా ఇళ్లు, పింఛన్ల పెంపు, అమ్మఒడి అమల్లోకి వస్తాయన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు 152 కోట్ల రూపాయలతో నెలకొంటున్నాయని తెలిపారు. పురపాలక సంఘం రెవెన్యూ పెంపు, సిబ్బంది కొరత గురించి సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడినట్లు తెలిపారు.
ఇది చూడండి: 15 కిలోమీటర్ల జాతీయ జెండాతో మానవహారం