కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రీన్జోన్లలో పరిశ్రమలను తిరిగి తెరిచేందుకు తీసుకున్న శాఖాపరమైన చర్యలపై అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిశ్రమలు తెరిచేందుకు అనుమతి తప్పనిసరని మంత్రి ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు పరిశ్రమల్లో పని చేసేవారి రక్షణపై దృష్టి సారించాలన్నారు. కొన్నిచోట్ల పరిశ్రమలు ప్రారంభించడానికి ఎదురవుతున్న సమస్యలను ఆయా జిల్లాల అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాల వారీగా తెరుచుకున్న పరిశ్రమల వివరాలు, ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలపై మంత్రి చర్చించారు.
ఇదీచదవండి