ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోసమే ప్రజా హక్కు కార్యక్రమం: మంత్రి అనిల్

ప్రజా హక్కు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా వేణుగోపాలపురంలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

minister anil started praja hakku program at nellore
సమస్యల పరిష్కారం కోసమే ప్రజా హక్కు కార్యక్రమం
author img

By

Published : Jul 8, 2021, 8:16 PM IST

ప్రజా సంక్షమమే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు నగరం వేణుగోపాలపురంలో ప్రజా హక్కు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రజా హక్కు ద్వారా వచ్చే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వారానికి రెండు ప్రాంతాల్లో ప్రజా హక్కు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్​ఆర్​ 72వ జయంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.