నెల్లూరు నగర కార్పొరేషన్ రూపురేఖలు మార్చేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్‌ను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతామన్నారు.
కొవిడ్ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిందన్న మంత్రి.... ఖర్చులు తగ్గించి, ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్‌కు రావాల్సిన బకాయిలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్నింటిని సమన్వయం చేసుకుంటూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
ఇదీ చూడండి: 'రాష్ట్ర సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన'