ETV Bharat / state

'జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జలాశయాలు నిండాయి'

భారీగా తరలివస్తున్న వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఎన్నడూ లేని విధంగా కండలేరు జలాశయంలో నీటి నిల్వకు అధికారులు సంకల్పించారని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Oct 23, 2020, 9:09 AM IST

minister anil in temple
ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి అనిల్ కుమార్

కండలేరు జలాశయంలో రికార్డు స్థాయిలో నీటి నిల్వ చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా 60 టీఎంసీలు నిల్వ చేయానలి సంకల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే నీటి మట్టం 55 టీఎంసీల నీరు వచ్చిందన్నారు.

విజయదశమి సందర్భంగా నెల్లూరులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే వర్షాలు విస్తారంగా కురిసి.. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయన్నారు. కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

సోమశిల జలాశయానికి భారీగా వరద.. దిగువకు నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.