నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లోని 131 మంది బిహార్ వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలుత గూడూరు నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో వారిని నెల్లూరుకు తరలించిన అధికారులు.. అక్కడి నుంచి శ్రామిక్ రైలులో వారి రాష్ట్రానికి పంపించనున్నారు. ఈ క్రమంలో రైలులో పాటించవలసిన భౌతికదూరం, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలీలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి..