ETV Bharat / state

'మమ్మల్ని ఇళ్లకు పంపించండి' - menakure sez migrants workers news

నెల్లూరు జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఉంటున్న వలస కార్మికులు కాలినడకతో ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో భవనంలోకి వెళ్లకుండా బయటనే చెట్ల కింద కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన చేపట్టిన నాయుడుపేటలోని వలస కూలీలు

author img

By

Published : May 10, 2020, 7:00 PM IST

జిల్లాలోని నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఉంటున్న వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూలీ పనులు చేసే 195 మంది... మేనకూరు సెజ్​లో పనిచేసే 130మంది మూడు రోజులుగా పాఠశాలలోనే ఉంటున్నారు. వీ‌రిని రైళ్లలో వాళ్ల రాష్ట్రాలకు తరలించే క్రమంలో అధికారులు వారిని బస్సులో ఎక్కించడం దింపడం చేస్తున్నారు.

ఈ మేరకు ఆందోళన చేపట్టిన వలస కూలీలు తాము ఇళ్లకు నడచి వెళ్తామంటూ పట్టుబట్టి జాతీయ రహదారి పక్కన చెట్ల కింద కూర్చున్నారు. లాక్​డౌన్​ నుంచి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నమంటూ మేనకూరు సెజ్​లో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం రైల్లో గూడూరు నుంచి ఛత్తీస్ గఢ్, బిహార్ తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

నాయుడుపేటలో పేదలకు అండగా దాతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.