ఈ నెల 22న జరగనున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని పది ప్రాంతాల్లో నిర్వహించిన శిబిరాల్లో దాదాపు 1500 మంది రక్తదానం చేశారు. నగరంలోని రెడ్క్రాస్ ఆవరణలో జరిగిన రక్తదాన శిబిరాన్ని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్చేసి తమ అభిమాన నటుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి కారణంగానే తాను రాజకీయల్లోకి వచ్చానని కృష్ణారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి.. దివంగత నేత హరికృష్ణకు చంద్రబాబు నివాళి