నెల్లూరు జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మస్తాన్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఎల్సీ తీసుకొని ఓ గృహానికి సంబంధించిన విద్యుత్ పని కోసం స్తంభంపై ఉన్నాడు. అదే సమయంలో 11 కేవీ తీగ తగిలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగలపైనే వేలాడుతూ... మృతి చెందాడు. పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫీజ్ తీసి స్తంభంపైకి ఎక్కి మృతిచెందాడని విద్యుత్ శాఖ ఏఈఈ సురేశ్ వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: ఫోన్ మోగిందా.. సొమ్ము గోవింద..!