నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు పొలిమేరల్లో దట్టమైన కంప చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని పాక్షికంగా దహనం చేసి ఉండడాన్ని స్థానికులకు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, జాగిలం, వేలిముద్రల నిపుణుల విభాగం వంటి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశాయి. సీఐ నరసింహారావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ మహిళ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఇవి చదవండి...మహిళపై కత్తితో దాడి ... అక్కడిక్కడే మృతి