నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలమూడిలో ఈనెల 22వ తేదీన న్యాయ సేవల శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరానికి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు న్యాయమూర్తులు హాజరవుతారని లోక్ అదాలత్ న్యాయమూర్తి సుధా తెలిపారు. నల్సా గిరిజన హక్కులు, రక్షణ అమలు పథకం కింద ఈ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా గిరిజనులకు ఉండే పథకాలు, రాయితీలు అందేలా చూడటం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు న్యాయ సహాయం అందించేందుకే ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీచూడండి.గ్రామీణ బ్యాంకులో గోల్మాల్..మేనేజర్ ఖాతాలో రూ.12 లక్షలు..!