నెల్లూరుకు చెందిన జితేంద్రకు చిన్నతనం నుంచి స్కేటింగ్ అంటే ఎంతో ఆసక్తి. జిల్లాలో అనేక మంది స్కేటింగ్ క్రీడాకారులను తయారు చేయడానికి పదేళ్లుగా తపన పడుతూ...ఇంటర్మీడియట్ నుంచే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తెల్లవారుఝామున మైదానాలకు వెళ్లి.. శిక్షణ ఇచ్చారు. పదేళ్లుగా శిక్షణ ఇస్తూ స్కేటింగ్ క్రీడపట్ల యువత ఆకర్షించేలా చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నా.. తనకున్న ఆసక్తిని మాత్రం కొనసాగిస్తూ వచ్చారు.
వృత్తి న్యాయవాది... ప్రవృత్తి స్కేటింగ్...
నెల్లూరులోని వీఆర్సీ, ఏసీ.సుబ్బారెడ్డి మైదానాలకు వెళ్లి స్కేటింగ్ పై చిన్నారుల్లో ఆసక్తిని కలిగించారు. ముత్తుకూరు రోడ్డులోని నారాయణ మెడికల్ కళాశాల వద్ద ప్రస్తుతం 300మందికిపైగా శిక్షణ ఇస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు నామమాత్రపు ఫీజు తీసుకుంటున్నారు.
మానసికోల్లాసానికి ఎంతో ఉపయోగపడుతుంది
జిత్రేంద్ర వద్ద శిక్షణ తీసుకుంటున్న పలువురు.. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా మారారు. మానసిక ఉల్లాసానికి చురుకుదనానికి దృఢత్వానికి.. స్కేటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని క్రీడాకారులు తెలిపారు. కోచ్ జితేంద్ర చక్కని శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం క్రీడా రింగ్‌ను నిర్మాణం చేస్తే... అనేక మంది అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారులను తయారు చేస్తానని కోచ్ జితేంద్ర నమ్మకంగా చెబుతున్నారు.
ఇదీ చదవండి: బండెనక బండి కట్టి... ఎడ్ల బండి పోటీ పెట్టి!