నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి ఘాట్ రోడ్డు, వెంకటాచలం మండలకేంద్రం రోడ్డు నిర్మాణానికి అధికారులు అటవీ భూమిని కేటాయించారు. అందుకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయగిరి మండలం కొండాయపాలెం రెవెన్యూ గ్రామంలో గుర్తించిన భూములను ఆత్మకూర్ ఆర్డీవో సువర్ణమ్మ.. స్థానిక తహసీల్దార్ హరనాథ్తో కలిసి పరిశీలించారు. ప్రత్యామ్నాయ భూముల హద్దుల సర్వేయర్ వివరాలు సేకరించారు.
కొండాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 1261, 1262లో 11.47ఎకరాల రెవెన్యూ భూమిని గుర్తించామన్నారు. నివేదికలను జిల్లా పాలనాధికారికి పంపిస్తామని తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే భూమిని అటవీ శాఖకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో భూముల రీసర్వే, నీటి పన్ను వసూలు తదితర విషయాలపై వీఆర్వోలతో సమీక్షించారు.
ఇదీ చదవండి: మర్రిపాడులో ఎస్ఈబీ సోదాలు.. 3 ఇసుక లారీలు సీజ్