Labor Unions Agitation Condemning Attack on Kavali RTC Driver : ఒక్కసారిగా అంత మంది తమపై దాడి చేయడానికి రావడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని.. దేవుడి దయతోనే బతికి బయట పడ్డామని నెల్లూరు జిల్లా కావలిలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌లు బీఆర్‌సింగ్, శ్రీనివాస రావు ఆవేదనతో చెప్పారు. తమపై విచక్షణారహితంగా దాడి చేసిన 14 మందిపై ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
RTC Unions Calls For Strikes Against Attack on RTC Driver in Kavvali : ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఘటనకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగు అంతా ఆదివారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని, డిపోల వద్ద నిరసనలు తెలపాలని ఈయూ, ఎన్‌ఎంయూఏ (Telugu Nadu Trade Union Council) పిలుపు ఇచ్చాయి. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు (Non-Bailable Cases) పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ, ఆర్టీసీ ఎండీకి ఎన్‌ఎంయూఏ వినతిని అందజేసింది. సోమవారం నెల్లూరు కలెక్టర్, ఎస్పీని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఈయూ తెలిపింది.
Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
TNTUC Leaders Protest at Autonagar RTC Depot : విజయవాడలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ రామ్‌సింగ్‌ను TNTUC (Telugu Nadu Trade Union Council) రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పరామర్శించారు. డ్రైవర్‌పై దాడి ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నడిరోడ్డుపై పట్టపగలే వైఎస్సార్సీపీ నాయకులు ఘోరంగా దాడి (YSRCP Leaders Attacks) చేశారని దుయ్యబట్టారు. ఆటోనగర్ ఆర్టీసీ డిపో వద్ద టీఎన్‌టీయూసీ నాయకులు నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.
Rowdyism Under YSRCP Rule : డ్రైవర్‌పై దాడి చేయడం అమానుషమని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కావలిలో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఆత్మకూరులో సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ పాలనలో రౌడీయిజం హద్దు మీరుతోందని డ్రైవర్‌పై దాడి ఘటనే దీనికి నిదర్శనమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRCP MLA Comments on Attack on RTC : పోలీసులు దుండగులతో కుమ్మక్కయ్యారు: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసినవారు నరరూప రాక్షసులని వైఎస్సార్సీపీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి అన్నారు. కొందరు పోలీసులు వారితో కుమ్మక్కై నేరాలకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రతాప్‌కుమార్ రెడ్డి వీడియో విడుదల చేశారు.