Illegal Sand Transport JanaSena Leaders Dharna : నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వద్ద ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానికులతో కలిసి నిరసన ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ల వద్ద అనుమతులు చూపిస్తూ ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. అనుమతులు లేకున్నా దొంగ బిల్లులతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నరంటూ ఆందోళనకు దిగారు. రిచ్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు.
రిచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను (Illegal Sand Mining) జనసేన నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అధికారులకు ఫోన్ చేశారు. ఐనా వారెవరు చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు జనసేన నేతలు, స్థానికులు అడ్డుపడొద్దని ఎస్సై భోజ్యా నాయక్ అంటున్నారని వారు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా ఆపకుంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీధర్ హెచ్చరించారు.
అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నందు అనుమతులు నిలిపివేసిన మర్రిపాడు డంపింగ్ యార్డ్ అనుమతులు తీసుకొని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా లభించేటప్పుడు సోమశిల, పడమటి కంభంపాడు, గ్రామాల ప్రజలు ట్రాక్టర్లకు ఇసుకను లోడ్ చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో జేసీబీల సహాయంతో ఇసుక లోడ్ చేస్తున్నడంతో జీవనం కోల్పోయామని అక్కడివారు ఆరోపిస్తున్నారు. ఇసుక రీచ్ దగ్గర ఉన్న పంట పొలాలకు సాగు చేసేందుకు నీరు అందక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు.
ఆత్మకూరు మండలం అప్పారావు ఇసుక రీచ్ నుండి గత సంవత్సరంలో పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుక ఎక్కువ లోతు తీయడం వలన భారీ గుంతలు ఏర్పడ్డాయి. అలాగే పోర్లు కట్టలు సైతం ధ్వంసం చేయడంతో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు వరద నీరు చేరటంతో గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది.
Illegal Soil Mining: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. గుల్లవుతున్న వెంకన్న కొండ
సంగం ఇసుక రీచ్ వద్ద వంతెన పై భారీ ఇసుక వాహనాలు వెళ్తుండడంతో బ్రిడ్జి కూలెందుకు సిద్ధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్రిడ్జి నుంచి సుమారు వేల ఎకరాలకు రైతులు వెళ్లేందుకు అనుకూలంగా ఉందని ఆ బ్రిడ్జి కూలిపోతే పొలాలకు వెళ్లేందుకు దావా ఉండదని రైతులు తెలిపారు. అలాగే పెన్నా నది నుండి వచ్చే ఇసుక వాహనాలతో ఎర్రమట్టి లేసి పంటలన్నీ దెబ్బతింటున్నాయని అందుకే పంటని వేయటం మానుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లో పోర్లు కట్టలు సైతం భారీ యంత్రాలతో తవ్యి వేయడంతో వర్షాలు పడినప్పుడు పొలాల్లోకి నీరు చేరుతుందని రైతుల వాపోయారు.
ఇలా మూడు రీచ్‌లలో అనుమతులు అయిపోయినా గాని రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తరలించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా.. అరెస్ట్ చేస్తామంటూ తిరిగి గ్రామస్థులనే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Sand Mining: పట్టపగలే ఇసుక అక్రమ తవ్వకాలు.. వైఎస్సార్సీపీ నాయకుల అండదండలతోనే..