కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో జగనన్న విద్యా కానుకను ఆయన ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.
ఉదయగిరిలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి చక్కగా చదవుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యా కానుక ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, దివంగత మాజీ సీఎం వైఎస్ చిత్రపటాలకు విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. తహసీల్దార్ హరనాథ్ ఎంపీడీవో వీరస్వామి, ఎంఈవో మస్తాన్ వలీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: