భారతీయ జనతా పార్టీలో సీఎం జగన్కు కోవర్టులున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబును తిట్టడమే వారికున్న పని అని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. పనబాకకు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా అడ్డదారులు తొక్కి గెలిచిందని అచ్చెన్న ఆరోపించారు.
ఇదీ చదవండి: