ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ మహా సభ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ 10వ రాష్ట్ర మహాసభ నెల్లూరులో ఘనంగా జరిగింది. పురమందిరంలో జరిగిన మహాసభకు హైకోర్టు న్యాయమూర్తులు ప్రవీణ్ కుమార్, శేషసాయిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవిత్రమైన న్యాయవృత్తిలో న్యాయవాదులు విలువలతో కేసులు వాదించాలని వారు సూచించారు. న్యాయం వైపు సమర్ధవంతంగా వాదించినప్పుడే ఉత్తమ తీర్పులు వెలువడుతాయన్నారు. యువ న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంచుకొని, న్యాయ వ్యవస్థకు గౌరవం తీసుకురావాలన్నారు.
ఇదీ చదవండి: 'మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారు'