నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఎదుట గుమ్మానికి చెన్నై భక్తులు రూ.1కోటీ 50లక్షలతో తయారు చేయించిన బంగారు తాపడంను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేత పూజలు చేశారు. అక్కడి నుంచి దొరవారిసత్రం మండలాల్లో సాగునీటి కాలువలు పరిశీలించారు. చెంగాళ పరమేశ్వరి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్య,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి అన్న క్యాంటీన్లపై మంత్రి పిల్లి సుభాష్ ఏమన్నారంటే?