నెల్లూరు నగరం అయ్యప్పగుడి సెంటర్ సమీపంలోని పరుపుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలకు దుకాణంలోని పరుపులు, దిండ్లు, దూది పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. దాదాపు 25 లక్షల మేర నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని నాగూర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి