ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు, వంకలు - నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమశిల జలాశయానికి అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
author img

By

Published : Nov 19, 2021, 10:08 AM IST

Updated : Nov 20, 2021, 6:27 AM IST

నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముదివర్తి పాలెం వద్ద పెన్నానది పోర్లు కట్ట తెగింది. దాంతో ముదివర్తి పాలెం గ్రామాన్ని వరద ముచెత్తింది. గ్రామస్థులు భయాందోళనకు గురైయ్యారు. వరద ప్రవాహానికి నెల్లూరు భగత్ సింగ్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వెంకటేశ్వపురంలోని టిడ్కో గృహాలు నీట మునిగాయి.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

17 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్, నెల్లూరు పోలీసులు

నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల గ్రామ పరిధిలోని రొయ్యల గుంటల రాత్రి వరద నీటిలో చిక్కుకున్న 17 మందిని ఎన్డీఆర్ఎఫ్, నెల్లూరు పోలీసులు రక్షించారు. పెన్నా నది వరద నీటిలో చిక్కుకున్నారని సమాచారం ఇవ్వడంతో... మొదట 13 మందిని, తరువాత నలుగురిని మొత్తం 17 మందిని అర్ధరాత్రి రక్షించారు.

స్వర్ణముఖి నది ప్రవాహం ఉద్ధృతం...

నెల్లూరు జిల్లా స్వర్ణముఖి నది ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే నది వంతెనపై మూడు నాలుగు అడుగుల మేర నీరు పారుతోంది. ఇక మేనకూరు సెజ్ లోని కంపెనీల ఉద్యోగులు కార్మికులు సిబ్బంది బస్సులు ఈ మార్గంలో పోవడం లేదు. స్వర్ణముఖి నది ప్రవాహం పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు నాయుడుపేట ఎల్ఏ సాగరం ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు కోతకు గురవుతున్నాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఇక పెళ్లకూరు మండలం పుల్లూరు ముమ్మారెడ్డిగుంట మధ్యలో వాగులో నీటి పారుదల పెరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో ప్రమాదకరంగా దాటారు.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు, వంకలు

కంట్రోల్ రూం ఏర్పాటు

గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అధికారులు... పోలీసులను అప్రమత్తం చేశారు.ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామ మహిళా పోలీసుల సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. సైదాపురం మండలంలో పొదలకూరు మార్గంలో మాలేరు వాగు, పిన్నేరు వాగు, మనుబోలు మండలంలోని కొలనుకుదురు, కట్టువపల్లి, చిల్లకూరు పరిధిలోని తమ్మినిపట్నం, తిప్పగుంట పాలెం, పాలిచేర్ల, గూడూరు రూరల్ పరిధిలోని పంబలేరు, చల్లకాలువ వాగు పొంగి పొర్లుతున్నాయి.

వెంకటగిరి లొ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కైవల్యా నది పరవళ్లు తొక్కుతుంది. వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గర నది ప్రవాహం కొనసాగుతూ ఉంది. బాలాయపల్లి మండలం నిండలి దగ్గరి కాజ్వే పై కైవల్యా పొంగి పోర్లుతుండటంతో నిన్నట్నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగడం లేదు.

నిండుకుండలా సోమశిల..

సోమశిల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో..... నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోర్లుకట్ట, జయలలితానగర్, ఈద్గామిట్ట ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు ప్రవేశించింది. రాకపోకలకు ఆస్కారం లేక అండర్ బ్రిడ్జిల కింద 2 ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. గూడూరులోని ప్రధాన రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

డక్కిలి మండలంలో కురిసిన వర్షాలకు సంగనపల్లి కలుజు వద్ద ఉద్ధృతంగా వరద ప్రవాహం ఉంది. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి లో కేత మన్నేరు వాగు నీటితో పొంగి పొర్లుతుంది. జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. 4000 వేల ఎకరాల్లో వరి నాట్లు వేసిన పంట నీటమునిగింది. 2600 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. మినుము 145, వేరుశనగ 10 శనగ 50 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఇంకా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు .

పెన్నా మహోగ్రరూపం..

పెన్నా నది ఉగ్రరూపం దాలుస్తోంది. నెల్లూరు నగరంలోని పెన్నా వారధి వద్ద వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. సోమశిల నుంచి దాదాపు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, ప్రస్తుతం నెల్లూరులో లక్షా 60 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ప్రవాహం పెరిగేకొద్దీ నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

తీవ్రపంట నష్టం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మర్రిపాడు, అనంతసాగరం, కలువాయి, చేజర్ల, వెంకటగిరి, పొదలకూరు మండలాల్లో సుమారు 30వేల ఎకరాల పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.

తుఫాను ప్రభావంతో ఉదయగిరి ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అలుగులు ప్రవహిస్తున్నాయి. ఉదయగిరి పట్టణం వద్ద ఉండే ఆనకట్ట చెరువు జలకళ సంతరించుకుంది. అలుగు ఉద్ధృతంగా ఉదయగిరి నుంచి నెల్లూరు, కావలికి వెళ్లే రోడ్డుపై ప్రవహిస్తుండడంతో కొంత సమయంపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అలుగు ప్రవాహం నుంచి రోడ్డు దాటే ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఐ గిరిబాబుతో పాటు ఎస్సైలు అంకమ్మ, సాయి రెడ్డి సిబ్బందితో కలసి పర్యవేక్షణ చేసి తాడు సహాయంతో రోడ్డు దాటించారు. ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయానికి వర్షపు నీరు చేరడంతో 35 అడుగుల సామర్థ్యం గల జలాశయంలోకి 25 అడుగులకు పైగా నీరు చేరింది. సీతారామపురం మండలంలోని మర్రిఊట్ల రిజర్వాయర్ నిండిపోయి అలుగు ప్రవహిస్తుంది.

ఇదీ చదవండి: Modi news: జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం

Last Updated : Nov 20, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.