నెల్లూరు జిల్లాలో మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో అకాల వర్షం, ఈదురు గాలికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొప్పాయి 45 ఎకరాలు, మామిడి 71 ఎకరాలు, నిమ్మ 22 ఎకరాలు, బత్తాయి 40 ఎకరాలు, బయట ఆరబెట్టిన మిరప 650 క్వింటాళ్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందనిని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కలీం బాషా తెలిపారు.
అలాగే.. వేరుశనగ 110 ఎకరాలు, నువ్వుల పంట ఐదెకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రభుత్వానికి నివేదికలు పంపామని, రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు.
ఇదీ చదవండి: