నెల్లూరు జిల్లా నాయుడుపేట పెళ్ళకూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సూళ్లూరుపేట, గూడూరు, ఓజిలి చిట్టమూరు, కోట వాకాడు మండలాల మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నదికి భారీగా నీరు చేరుకుంది. దీంతో ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీరనుంది. పెళ్ళకూరు మండలం శిరసనంబేడు వద్ద వర్షం నీరు చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ పొలాలు కోతకు గురవుతున్నాయి. వర్షాలు పుష్కలంగా కురవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు