నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట గ్రామంలోని పంట పొలాల్లో దాచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎస్‌పేట ఎస్సై సుభానికి వచ్చిన సమాచారం ప్రకారం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో సొదాలు చేయగా.. ఓ రూమ్‌లో భద్రపరిచిన 40 బస్తాల గుట్కాను పోలీసులు గుర్తించారు. పొలానికి సంబంధించిన వాచ్‌మెన్‌ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీచదవండి