ETV Bharat / state

జలనిధి చెంత.. జనహితమెంత?

సోమశిల జలాశయం నుంచి విడుదలైన వరద నీటి ఉద్ధృతి.. దాని తీవ్రతకు ప్రాజెక్టు వద్ద కట్టడాలు కోతకు గురయ్యాయి. 2001లో జలాశయానికి 3.6 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలైనప్పుడు కొన్ని నష్టాలు ఎదురైనా.. కట్టడాలు మాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం 3.69 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగా... సోమశిల పరిధిలోని ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జలనిధి చెంత..జనహితమెంత!
జలనిధి చెంత..జనహితమెంత!
author img

By

Published : Nov 30, 2020, 4:49 PM IST

సోమశిల జలాశయం వద్ద ఫ్లడ్‌బ్యాక్‌లు, వరద నీటి మళ్లింపు అడ్డుకట్టలు కోతకు గురై కొట్టుకుపోయాయి. చివరకు డ్యామ్‌ అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు టవర్, విద్యుత్తు విభాగం కొట్టుకుపోవడం పరిస్థితికి అద్దం పట్టింది. ఈ టవర్‌ ప్రాంతంలోనే కాలనీకి నీటిని సరఫరా చేసే పంప్‌హౌస్, హిల్‌ కాలనీకి నీటిని పంపింగ్‌ చేసే రెండు పంపింగ్‌ పథకాలు కొట్టుకుపోయాయి. కమ్యూనిటీ రక్షిత నీటి పథకం దెబ్బతిని ఆగిపోయింది. సోమశిల రక్షిత నీటి పథకానికీ అదే స్థితి. ఇక, పెన్నానది గట్టు కోతకు గురైంది. నీటి విడుదల పూర్తిగా ఆగితేగానీ, ఆప్రాన్‌పై నష్టాలు పూర్తిగా తెలియని పరిస్థితి నెలకొంది.

పెన్నాలోకి 154.8 టీఎంసీలు

జలాశయంలోకి ఇప్పటి వరకు 277 టీఎంసీల వరద నీరొచ్చింది. అందులో 154.8 టీఎంసీలను పెన్నాలోకి వదిలారు. వీటిలో సుమారు 150 టీఎంసీలకుపైనే సముద్రంలోకి వెళ్లింది. ఆ లెక్కన చూస్తే రూ. ఆరు వేల కోట్ల విలువైన జలాలు వృథాగా కడలిలో కలిశాయి. కండలేరు జలాశయానికి 61.15 టీఎంసీలు తరలించారు. సోమశిల కాలువలకు 14.7 టీఎంసీలు పంపిణీ చేయగా.. జలాశయంలో 72.2 టీఎంసీలు నిల్వ ఉంది. జలాశయం వరద నీటి ఉద్ధృతికి కట్టడాలు, పంటలు, రొయ్యల, చేపల గుంటలు దెబ్బతిన్నాయి. గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కాయి. ఇంకోవైపు విలువైన జలాలు నిల్వ చేసుకునే అవకాశం లేక నష్టపోవాల్సి వచ్చింది.

నీటి నిల్వలు
నీటి నిల్వలు

పటిష్ఠ రక్షణ పనులు

ఈసోమశిల ప్రాజెక్టు, దాని అనుబంధ కట్టడాలను, సోమశిల కాలనీ, గ్రామం రక్షణకు పటిష్ఠమైన పనులు చేపడతాం. జలాశయం ఎడమవైపు రిటైనింగ్‌ వాల్‌ను కలువాయి రోడ్డు వరకు పొడిగిస్తాం. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.66.5 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. వాటితో ప్రాజెక్టు సమస్యలు పరిష్కరిస్తాం. జలాశయానికి వచ్చిన నీటిలో 150 టీఎంసీల పైనే సముద్రంలో కలిసింది. రెట్టింపు సామర్థ్యంతో నీరు తరలించేలా కండలేరు వరద కాలువ, ఉత్తర కాలువలను వెడల్పు చేస్తాం. తద్వారా వరదల కాలంలో జలాలను వేగంగా చెరువులకు తరలించడం ద్వారా మరింత ప్రయోజనం కలగనుంది.

- కృష్ణారావు, ప్రాజెక్టు ఎస్‌

ఇది కోతకు గురైన ఎడమ గట్టు రక్షణ కట్ట. గాబ్రియాన్‌ విధానంతో ఈ వరద మళ్లింపు కట్టను పటిష్ఠంగానే నిర్మించినా.. నీటి ఉద్ధృతిని తట్టుకోలేక ఇలా కోతకు గురైంది. సోమశిల వరద ఉద్ధృతి తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కట్ట పూర్తిగా దెబ్బతిని ఉంటే.. వరద సోమశిల గ్రామం, ప్రాజెక్టు కాలనీలపై పడేది. నష్టం మరింత అపారంగా ఉండేది.

కోతకు గురైన కట్ట
కోతకు గురైన కట్ట

పెన్నా వరద ఉద్ధృతికి విద్యుత్తు టవర్‌ కొట్టుకుపోయింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వ్యవస్థ ఇలా నదిలో కూరుకుపోయింది. ఈ ప్రాంతంలోని పంప్‌హౌస్‌లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. ఇలా ప్రాజెక్టు కాలనీ, ప్రభుత్వ కార్యాలయాల ఉనికినే ఈ వరద ప్రశ్నించింది.

ఇదీ వరద ఉద్ధృతి.. సోమశిల జలాశయం నుంచి ఇప్పటి వరకు 154 టీఎంసీలపైనే నీరు సముద్రంలో కలిసింది. అంటే, సుమారు రూ. 6000 కోట్ల పంటను పండించేందుకు అవసరమైన జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేక.. అలా సముద్రంలోకి వదలగా, నీటి కోతతో నష్టాలు సైతం మూటగట్టుకోవాల్సి వచ్చింది.

చేరిన వరద నీరు
చేరిన వరద నీరు

ఇదీ చదవండి:

విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.