నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కష్టమొస్తే కాపాడాల్సి పోలీసే.. ఓ బాలికపై అత్యాచారం చేయబోయాడు. జిల్లాలోని చిట్టమురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్.. కేసు విషయంలో ఓ కుటుంబాన్ని ఇంటికి రమ్మని పిలిచాడు. తల్లిదండ్రులతో పాటు బాలిక కూడా అక్కడికి వెళ్లింది.
ఎవరూ లేని సమయంలో సుధాకర్ ఇంటికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేయబోయాడు. భయపడి తల్లిదండ్రులను వెతుక్కుంటూ పరిగెట్టిన బాలిక.. విషయాన్ని వారికి వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందిచారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి:
CM JAGAN LIVE: సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందనివారికి సీఎం జగన్ చేతుల మీదుగా రూ.703 కోట్లు జమ