ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను నియమించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శిక్షణ పొందిన గ్రామవాలంటీర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో వాలంటీర్లు చేయాల్సిన పనులను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్సాహవంతులతో పాటలు పాడించారు. వెంకటగిరి నియోజకవర్గంలో 1565 మందిని వాలంటీర్లుగా నియమించగా... కలువాయి, రాపూరు, దక్కిలి, వెంకటగిరి మండల కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇది చూడండి: భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తలారా! జాగ్రత్త!