నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో దువ్వూరు జయదేవ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 4 సవర్ల బంగారం దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సోమయ్య తన సిబ్బందితో కలిసి వచ్చి ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. చోరిీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి:
వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం