ETV Bharat / state

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం

వారిద్ధరూ ప్రేమించుకున్నారు... కలిసి సహజీవనం చేశారు.. తీరా పెళ్లి ఊసు ఎత్తేసరికి యువకుడు ముఖం చాటేశాడు. మోసం చేసిన ప్రియుడితో తన వివాహం జరిపించాలంటూ ప్రియుడి ఇంటిముందు మౌనదీక్ష చేపట్టింది ప్రేమికురాలు. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో జరిగింది.

author img

By

Published : Oct 7, 2020, 10:39 AM IST

girlfriend-protest-in-front-of-boyfriends-house-in-nellore-district
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌనపోరాటం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి గ్రామంలో ప్రియుని ఇంటి ఎదుట బైఠాయించి మౌనదీక్ష చేపట్టింది ఓ యువతి.

వివరాల్లోకి వెళితే...

కర్నూలు జిల్లాకు చెందిన రేష్మ అనే యువతి నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో సెల్ ఫోన్ తయారీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అటువంటి సమయంలోనే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తిరుపతి నాయుడుపల్లి గ్రామానికి చెందిన హనుమయ్య అనే యువకుడితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఫేస్​బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలుసుకుని... ఆ యువకుడు ఇప్పుడు ముఖం చాటేసి తనను మోసం చేశాడని ఆ యువతి తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ...యువకుడి ఇంటి ఎదుట కూర్చొని మౌనదీక్ష చేపట్టింది.

జిల్లాలో పలువురు అధికారుల వద్దకు తన సమస్య తీసుకువెళ్లినా న్యాయం జరగనందున ప్రియుని ఇంటి ముందు బైఠాయించినట్లు ఆ యువతి తెలిపింది. తనను మోసం చేసిన యువకుడితో వివాహం జరిపించాలంటూ లేకుంటే అన్నపానీయాలు మాని... న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటానని చెప్పింది. ఆమెకు రక్షణగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: హైదరాబాద్ రాయదుర్గంలో నేపాల్ ముఠా భారీ చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.