యాడ్స్ చూసి ..ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయింది ఓ బాలిక. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలానికి చెందిన బుజ్జి రాజు అనే వ్యక్తి తన మేనకోడలు..సినిమా మోజుతో పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2020 డిసెంబర్ 17వ తేదీనుంచి కనిపించడం లేదని ఆయన సోమశిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వరికుంటపాడు మండలానికి చెందిన బాలిక.. అనంతసాగరం మండలంలో అమ్మమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఒకరోజు టీవీలో యాడ్స్ చూసి హైదరాబాద్‌లోని ఓ స్టూడియో వారికి ఫోన్ చేసిందని ఆయన తెలిపాడు. సినిమాలు, సీరియళ్లపై ఆసక్తి ఉందని.. అవకాశం కల్పించమని కోరిందని అన్నాడు. అదేరోజు కొందరికి ఫోన్ చేసి... ఊరునుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు.
గాలింపు చేపట్టిన పోలీసులు పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడి స్కూటర్‌పై వెళ్లినట్టు సమాచారం తెలుసుకున్నారు. ఆ యువకుడిని విచారించగా...తనకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని.. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానని చెప్పిందని యువకుడు తెలిపాడు. నెల్లూరు వరకు వదలమని కోరగా తన స్కూటర్‌పై బస్టాండ్‌లో వదిలి వచ్చానని పోలీసులకు చెప్పాడు. ఎస్సై సుబ్బారావు హైదరాబాద్‌కు చెందిన ఆ ఇనిస్టిట్యూట్‌కు ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అమ్మాయి ఇక్కడికి వస్తానన్న మాట వాస్తవమేనని కానీ.. ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదని వారు తెలిపారు.
గత నెల 17వ తేదీ ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఇప్పటికీ రెండు వారాలు గడుస్తున్నా.. ఎక్కడ ఉందో జాడ తెలియట్లేదని మేనమామ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇదీ చూడండి. రామతీర్థం రగడ: అడ్డంకుల నడుమ కొండపైకి చంద్రబాబు