తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ యువతి హల్చల్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓ యువతి వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తాను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి అయినా అతనితోనే వివాహం చేయించాలంటూ హడావుడి చేసింది. నెల్లూరు జిల్లా కపాటిపాలేనికి చెందిన ఓ యువతి పాలిటెక్నిక్ కళాశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న సింధూర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. సింధూర్‌కు పెళ్లి అయినా తననతోనే వివాహం చేయాలంటూ వాటర్ ట్యాంకు ఎక్కి చనిపోతానంటూ బెదిరించింది. తాను ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, యువతిని కిందికు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు నచ్చచెప్పినా ఆమె పట్టు వీడలేదు.ఇదీ చదవండి:
నాయుడుపేటలో బంగారం చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్