నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని జెఆర్పేట ప్రాంతంలో మూడో అంతస్తులో ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి మెడలోని బంగారం దోచుకెళ్లారు. రత్నమ్మ తన కుమార్తె, మనవరాళ్లతో కలిసి నివసిస్తుంది. తనను పట్టుకున్న తీరును బట్టి వచ్చిన దొంగలో ఒకరు మహిళగా ఆమె గుర్తించారు. ఎత్తుకెళ్లిన బంగారు నగ 6 సవర్లు (సుమారు 5 తులాలు ) ఉందని చెప్పింది. వాటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొంది. ఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. ఆత్మకూరు డివిజన్ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నా పోలీసు నిఘా సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి :