ETV Bharat / state

ధాన్యం సేకరణలో రూ.700 కోట్ల కుంభకోణం: గల్లా జయదేవ్

నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాశారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే అంత జరిగితే రాష్ట్రం మొత్తం ఎంతో ఆలోచించండిని అని గల్లా జయదేవ్ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

galla jayadev on paddy scam in nelore
ఎంపీ గల్లా జయదేవ్
author img

By

Published : Nov 3, 2020, 7:06 AM IST

నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాశారు. ఒక్క జిల్లాలోనే ఇంత భారీ కుంభకోణం జరిగిందంటే రాష్ట్రం మొత్తం వరి ధాన్యం సేకరణలో ఇంకెంత పెద్ద మోసముంటుందో ఊహించాలని సూచించారు. మిల్లర్లు, దళారులు, కొందరు అధికారులు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేశారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు.

‘'నెల్లూరు జిల్లాలో 8 లక్షల టన్నుల ధాన్యం పండితే వివిధ సేకరణ కేంద్రాల ద్వారా 3 లక్షల టన్నులనే సేకరించారు. మరోవైపు మిల్లర్లు/దళారులు నేరుగా రైతులను సంప్రదించి తేమ తవుడు పేరుతో భయపెట్టి మద్దతు ధరకంటే తక్కువకు కొంటున్నారు. వీరు అధికారులతో కుమ్మక్కై ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో బినామీల పేర్లు నమోదు చేశారు. వ్యవసాయశాఖకు చెందిన ఈ-క్రాప్‌, క్రాప్‌ఈల్డ్‌ డేటాను పౌర సరఫరాలశాఖ డేటాబేస్‌తో పోల్చి చూస్తే తేడా కనిపిస్తుంది. రైతుల నుంచి తక్కువకు కొన్న మిల్లర్లు, దళారులు ప్రభుత్వానికి ఎంఎస్‌పీ ప్రకారం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. మరోవైపు ధాన్యం రవాణా చేయకపోయినా చేసినట్లు మిల్లర్లు/దళారులు రవాణా ఛార్జీలను దండుకుంటున్నారు. వాస్తవంగా రవాణా చేసిన రైతులకు ఎగ్గొడుతున్నారు’'- లేఖలో వివరించిన గల్లా జయదేవ్

నెల్లూరు జిల్లా రైతు జైపాల్‌ తన ఖాతాలో అధిక మొత్తం జమయిందంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారించమన్నందుకు పోలీసులు అరెస్టు చేసి వేధించారని జయదేవ్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘ఆయనకు చెందిన 80 సెంట్ల పొలంలో 8 పుట్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి గ్రామ కార్యదర్శి, వాలంటీరుకు పలుసార్లు మొరపెట్టుకున్నా నిష్ఫలమైందని... విధిలేని పరిస్థితుల్లో ఇద్దరు మధ్యవర్తులకు పుట్టి రూ.10,100కు అమ్మినట్లు తెలిపారు. వారు రైతు నుంచి ఆధార్‌, బ్యాంకు ఖాతానెంబర్లు తీసుకుని రూ.80,800 డిపాజిట్‌ చేశారని... రెండురోజుల తర్వాత ఏపీ ప్రభుత్వ పౌర సరఫరాల వెబ్‌సైట్‌ మాత్రం రైతు జైపాల్‌ రూ.8,47,770 విలువైన ధాన్యం విక్రయించినట్లు చూపిందని గల్ల జయదేవ్ తెలిపారు. తాను విక్రయించిన ధాన్యంకంటే ఎక్కువ మొత్తాన్ని తన పేరున చూపారని, దానిపై విచారించి సరి చేయాలని జైపాల్‌ అధికారులను కోరారినట్లు జయదేవ్ అన్నారు. మోసాన్ని బయటపెట్టిన రైతునే అరెస్టు చేశారని మీడియాలో రావడంతో ఆయన్ని వదిలిపెట్టారు’ అని గల్లా జయదేవ్‌ లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు.

అనిశా డీజీకి తెదేపా ఎమ్మెల్సీల లేఖ

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రూ.700 కోట్ల భారీ కుంభకోణంపై సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అనిశా డీజీకి వారు సోమవారం లేఖ రాశారు.

ఇదీ చదవండి:

'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.