Fire In Train: అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లా గూడూరు రైల్వేస్టేషన్ జంక్షన్ సమీపంలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌లోని కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే రైలును గూడూరు రైల్వేస్టేషన్‌లో ఆపి.. మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు గంట పాటు రైలు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక రైలు చెన్నైకి బయల్దేరింది. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: