ETV Bharat / state

సహజీవనంలో సమస్యలు.. రోడ్డు పైనే ఘర్షణ..

author img

By

Published : Sep 5, 2021, 4:25 PM IST

నెల్లూరుకు చెందిన హోమియో వైద్యుడు, ఓ మహిళ రోడ్డుపైనే ఘర్షణ పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పదమూడేళ్లుగా సహజీవనం చేసి మోసగించాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కొన్ని నెలలుగా అతని వైఖరి నచ్చక పోవటంతో దూరంగా ఉంటున్న తనని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

fight
రోడ్డు మీద వైద్యుడు, మహిళ ఘర్షణ..
రోడ్డు మీద వైద్యుడు, మహిళ ఘర్షణ..

ఓ వివాహేతర సంబంధం రోడ్డుకెక్కింది. నెల్లూరు పొగతోటలో బాల కోటేశ్వరరావు అనే వ్యక్తి హోమియో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని వద్ద పని చేసే ఓ మహిళ.. కొన్నేళ్లుగా వైద్యుడు తనతో సహజీవనం చేస్తూ ఇటీవల తనను మోసం చేశాడని ఆరోపించింది. అతని వైఖరి నచ్చక కొంత కాలంగా దూరంగా ఉంటున్నానని తెలిపింది. నేడు కలవాలంటూ పిలిపించిన బాల కోటేశ్వరరావు.. తిరిగి తన వద్దకు రావాలంటూ బలవంతం చేశాడని ఆరోపించింది. అందుకు నిరాకరించటంతో తనపై దాడికి దిగాడని తెలిపింది. మరోవైపు ఆ మహిళ తనను ఇబ్బంది పెడుతోందని ఆ వైద్యుడు ఆరోపించాడు.

కొన్ని గంటలు పాటు జరిగిన వీరిరువురి వాదనలో.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు, చెప్పులు, దూషణలతో ఘర్షణ పడ్డారు. స్థానికులు వీరిని నిలువరించేందుకు ప్రయత్నించినా వినిపించుకొలేదు. పక్కనే ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట ఈ వివాదం జరగటంతో.. కాలేజీ సిబ్బంది కలగజేసుకొని.. ఇరువురిని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. నాలుగవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండీ.. DWAKRA WOMEN MONEY SCAM: డబ్బులు కొట్టేశాం.. వాటాలు పంచుకున్నాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.