ETV Bharat / state

నిరాడంబరంగా బారాషహీద్ దర్గా గంధమహోత్సవం.. పాల్గొన్న మంత్రి అనిల్​ - నెల్లూరులో బారాషహీద్ దర్గా గంధమహోత్సవం తాజా సమాచారం

నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గా గంధమహోత్సవం నిరాడంబరంగా సాగింది. ఈ మహోత్సవంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Barashaheed Dargah Sandalwood Festival
బారాషహీద్ దర్గా గంధమహోత్సవం
author img

By

Published : Aug 22, 2021, 7:41 AM IST

నెల్లూరులో ప్రముఖ బారాషహీద్ దర్గా గంధమహోత్సవం నిరాడంబరంగా జరిగింది. యేటా లక్షలాది మంది భక్తులతో వేడుకగా సాగే గంధమహోత్సవం.. నేడు కొవిడ్​ కారణంగా అతికొద్ది మంది భక్తుల సమక్షంలోనే సాగింది. ముందుగా నగరంలోని కోటమిట్ట నుంచి గంధాన్ని ఊరేగింపుగా బారాషహీద్ దర్గాకు తీసుకువచ్చారు. అనంతరం కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేన్ ప్రార్ధన నిర్వహించి బారాషహీద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు.

ఈ వేడుకలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి అంతమై, ప్రజలందరికి మంచి జరిగేలా భగవంతుడు కరుణించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండీ.. study survey : తెలుగు రాయలేరు... ఆంగ్లం చదవలేరు... లెక్కలు చేయలేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.