ETV Bharat / state

బాబోయ్​ నకిలీ శానిటైజర్లు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం ఏ కార్యాలయానికి వెళ్లినా... దుకాణానికి వెళ్లినా శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. లేనిపోని భయాలతో ఎంత ఖర్చయినా ప్రజలు వీటిని కొంటున్నారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త దందాలకు తెరలేపుతున్నారు. ఇలానే నెల్లూరు నగరం సంతపేట ప్రాంతంలో నాసిరకం శానిటైజర్ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.

నెల్లూరులో నకిలీ శానిటైజర్లు పట్టివేత
నెల్లూరులో నకిలీ శానిటైజర్లు పట్టివేత
author img

By

Published : Jun 18, 2020, 10:08 PM IST

ప్రస్తుత పరిస్థితులను అదనుగా చేసుకుని నాశిరకం శానిటైజర్ తయారు చేస్తూ కొందరు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు నగరం సంతపేట ప్రాంతంలో నాసిరకం శానిటైజర్ తయారు చేస్తుండగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. బొమ్మి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో శ్రీనివాసులు అనే వ్యక్తి సంతపేట దగ్గర శానిటైజర్లు తయారు చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తెచ్చుకుని శానిటైజర్ తయారు చేస్తూ.... నకిలీ లేబుల్స్​తో అమ్మకాలు సాగిస్తున్నాడు. తన వద్ద శానిటైజర్లు దొరుకుతాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయటంతో ఆ విషయం డ్రగ్ కంట్రోల్ ఏడీ వీరకుమార్​, ఇన్​స్పెక్టర్​ మహేష్​లకు తెలిసింది. ఈ క్రమంలో వినియోగదారుల్లా తమకు సరకు కావాలంటూ సోషల్ మీడియాలోనే సంప్రదించారు. అనంతరం దాడులు నిర్వహించారు.

అతని నుంచి దాదాపు 500 శానిటైజర్ బాటిళ్లు, ముడిసరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్​కు తరలించారు. శానిటైజర్ తయారు చేసేందుకు సంబంధించిన లైసెన్స్ అతని వద్ద లేదని, అవి నాసిరకంగా ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్లతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కొండ గెడ్డ కాలువ ఆక్రమణపై రైతుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.