నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీ.సీ. పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముత్తురాజ్ పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ఆగస్టు 31 నాటికి వేలం ప్రక్రియను పూర్తి చేయాలని వేలం నిర్వహణాధికారులను ఆదేశించారు. కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ వేలం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: